యువత గళాన్ని నొక్కొద్దు.. 'కాక్రోచ్ జనతా పార్టీ'పై వేటు అనాలోచితం: శశిథరూర్
- కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్' ఖాతా నిలిపివేతపై శశిథరూర్ అభ్యంతరం
- యువత భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతమన్న కాంగ్రెస్ ఎంపీ
- ప్రజాస్వామ్యంలో వ్యంగ్యం, విమర్శలకు చోటు ఉండాలని వ్యాఖ్య
- కొన్ని రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించిన కాక్రోచ్ పార్టీ
- ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని థరూర్ సూచన
ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్న వ్యంగ్యాస్త్ర వేదిక 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) 'ఎక్స్' ఖాతాను నిలిపివేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ చర్యను 'అనాలోచితమైన, విపత్కరమైన నిర్ణయం'గా అభివర్ణించారు. యువత తమ భావాలను, అసంతృప్తిని వ్యక్తీకరించడానికి ఒక వేదిక ఉండాలని, దాని గొంతు నొక్కడం సరికాదని ఆయన హితవు పలికారు.
కేవలం ఐదు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 19 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎదుగుదల తనను ఎంతగానో ఆకర్షించిందని థరూర్ తన 'ఎక్స్' పోస్టులో పేర్కొన్నారు. చట్టపరమైన డిమాండ్ మేరకు సుమారు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈ పార్టీ 'ఎక్స్' ఖాతాను భారత్లో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో థరూర్ స్పందిస్తూ.. "ప్రజాస్వామ్యంలో అసమ్మతి, హాస్యం, వ్యంగ్యం, చివరకు నిరాశను వ్యక్తీకరించడానికి కూడా వేదికలు అవసరమని" అభిప్రాయపడ్డారు. సీజేపీ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఉద్యమం భవిష్యత్తు ఎలా ఉంటుందో తనకు కచ్చితంగా తెలియదని, కానీ దీని వెనుక ఉన్న యువత తమ శక్తిని ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తీసుకురావాలని లేదా తమ ఓటు ద్వారా మార్పునకు గళం విప్పాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం యువతలో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని, ఇది ప్రతిపక్షాలకు ఒక గొప్ప అవకాశమని థరూర్ విశ్లేషించారు. ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, యువతను తమ వైపు తిప్పుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ?
"యువత కోసం, యువత చేత, యువత యొక్క రాజకీయ వేదిక"గా ఇది తమను తాము అభివర్ణించుకుంటోంది. "సోమరులు, నిరుద్యోగుల గొంతుక" అని కూడా వ్యంగ్యంగా పేర్కొంటోంది. అభిజీత్ డిప్కే దీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడాన్ని నిషేధించడం, పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం, పార్టీ ఫిరాయించిన వారిపై 20 ఏళ్ల నిషేధం విధించడం వంటి పలు ఆసక్తికర డిమాండ్లను ఈ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది.